News January 25, 2025

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: ASF కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆరోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, ఔషధ నిల్వలు,రిజిస్టర్లు,పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజల పట్ల వైద్యులు మర్యాదగా వ్యవహరించాలన్నారు.

Similar News

News January 26, 2025

మన తొలి ‘రిపబ్లిక్ డే’కు అతిథి ఎవరంటే..

image

ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మన తొలి రిపబ్లిక్ డేకు కూడా ఇండోనేషియా అధ్యక్షుడే చీఫ్ గెస్ట్ కావడం విశేషం. 1950లో ఇర్విన్ యాంఫీ థియేటర్లో నిర్వహించిన వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆ దేశానికి స్వాతంత్ర్యం దక్కడంలో భారత్ అండగా నిలిచింది.

News January 26, 2025

భీమవరానికి హీరో వెంకటేశ్, మీనాక్షి చౌదరి

image

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ ఆదివారం భీమవరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎస్ఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మీట్‌కి హీరో వెంకటేశ్, హీరోయిన్లు, ఏలూరు జిల్లా బుల్లిరాజు, మరికొంత మంది నటులు సందడి చేయనున్నారు. ఈ సినిమా రిలీజైన రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది.

News January 26, 2025

HYD: చిట్టి భరతమాత.. అదుర్స్ కదూ!

image

రిపబ్లిక్ డే వేడుకలు గ్రామగ్రామాన అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోరకంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఇబ్రహీంపట్నం పరిధి ఆరుట్లకు చెందిన శ్రుతి తన దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. తన కుమార్తెను భరతమాతగా అలంకరించి వావ్ అనిపించారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.