News March 28, 2024
ప్రజలకు సేవ చేయాలన్న స్పష్టమైన విజన్‌తో ఉన్నా: తాండ్ర

ఈ గడ్డ బిడ్డగా తాను 30 ఏళ్ల పాటు వ్యాపార, సాంకేతిక, సేవా రంగాల్లో గడించిన అనుభవంతో సేవ చేయాలన్న స్పష్టమైన విజన్‌తో ఉన్నట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెప్పారు. గురువారం కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. కొత్తగూడెం ప్రజలకు ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ చేస్తానన్నారు.
Similar News
News April 21, 2025
ఖమ్మం:ఓపెన్ పరీక్షలు..139గైర్హాజర్

ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.
News April 21, 2025
కొత్తగూడెం: యువతికి వేధింపులు.. కేసు నమోదు

యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడిపై కేసు నమోదైంది. వైరా విప్పలమడుగుకి చెందిన రాహుల్ కొత్తగూడెంకు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతి రాహుల్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఇచ్చేసింది. అయితే డబ్బు పూర్తిగా ఇవ్వలేదని.. దానికి బదులుగా తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధిస్తున్నాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా కేసు నమెాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడెం సీఐ కరుణాకర్ తెలిపారు.
News April 21, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

∆}మధిరలో జాబ్ మేళా∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు