News March 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

UPI మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. యు.పి.ఐ వ్యవస్థను ఉపయోగించి వినియోగదారుల బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును మాయం చేయడం సైబర్ నేరగాళ్ల పని అని తెలిపారు.
Similar News
News April 1, 2025
రామ్ చరణ్ ‘పెద్ది’ ఆడియో హక్కుల ధర ఎంతంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ- ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో మూవీకి మంచి బజ్ నెలకొనగా మూవీ టీమ్ తాజాగా మరో క్రేజీ న్యూస్ చెప్పింది. ఏఆర్ రెహమాన్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ రూ.35కోట్లకు దక్కించుకుందని ప్రకటించింది. రెహమాన్-చెర్రీ కాంబోలో ఇదే తొలిమూవీ కావడం విశేషం.
News April 1, 2025
ఆరుబయట పడుకుంటున్నారా?

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
News April 1, 2025
స్కిన్ క్యాన్సర్‌తో బాధపడ్డా: జాన్ సీనా

WWE సూపర్‌స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గతంలో తాను స్కిన్ క్యాన్సర్ బారినపడ్డట్లు వెల్లడించారు. ‘ఒకసారి డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు నా స్కిన్ కింది నుంచి క్యాన్సర్ కణుతులను తొలగించారు. WWE మ్యాచ్‌ల సందర్భంగా నా శరీరంపై మీరు ఆ స్పాట్స్‌ను చూడొచ్చు. మహమ్మారిపై పోరాడే సందర్భంలో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.