News January 16, 2025
ప్రజలు పోలీసు సేవలు వినియోగించుకోవాలి: నిర్మల్ SP

భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 58.17% పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 58. 17% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 58.00 శాతం, బేల 59.09, జైనథ్ 56.45, బోరజ్ 55.49, భీంపూర్ 59.99, సాత్నాల 63.46, తాంసి 57.30, మావలలో 53.06 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 21.80% పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.80% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 20.05 బేల 19.63, జైనథ్19.42, బోరజ్ 23.60, భీంపూర్ 24.93, సాత్నాల 28.00, తాంసి 24.26, మావలలో 16.40 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 14, 2025
ఆదిలాబాద్: నేడే పోలింగ్.. మీరు రెడీనా?

జిల్లాలో నేడు జరిగే 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 17 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యారు. ఎన్నికలు జరిగే 8 మండలాల్లో ఆదిలాబాద్(R)లో 4, బేల 1, జైనథ్ 1, బోరజ్ 1, భీంపూర్ 5, సాత్నాల 2, తాంసిలో ముగ్గురు సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉ.7గంటల నుంచి మ.1 వరకు పోలింగ్.. మధ్యాహ్నం ఫలితాలు ప్రకటిస్తారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.


