News March 18, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కమిషనర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించారని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కౌన్సిల్ హాల్లో ప్రజల నుంచి వినుతులు స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులలో ఎక్కువగా టౌన్ ప్లానింగ్ 46, ఇంజినీరింగ్ విభాగం నుంచి 24 ఫిర్యాదులు రాగా.. హెల్త్ శానిటేషన్ 4, ప్రాపర్టీ టాక్స్ 10, మంచినీటి సరఫరా 4.. మొత్తం 88 అప్లికేషన్లు వచ్చాయి.
Similar News
News March 18, 2025
ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్

జనగామలో కురుమ సంఘం నేతలు మంగళవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల యూత్ అధ్యక్షుడు బండ ప్రభాకర్ కురుమ హాజరై మాట్లాడారు. నూతనంగా నిర్మించబోయే మామూనూరు ఎయిర్‌పోర్టుకు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఏప్రిల్ 3న హైదరాబాద్‌లో జరగబోయే దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కురుమ సంఘం ముఖ్య నేతలున్నారు.
News March 18, 2025
భీకర దాడి.. 342 మంది మృతి

ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో భారీగా <<15798213>>మరణాలు<<>> సంభవిస్తున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకు 342 మంది పాలస్తీనీయులు మరణించారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, తమ దేశానికి చెందిన మిగిలిన 59 మంది బందీలను విడుదల చేయకపోతే గాజాపై దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హమాస్ గ్రూపును హెచ్చరించారు.
News March 18, 2025
మెదక్: ఎండిపోతున్న వరి.. రైతుల ఆందోళన

మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో జిల్లాలో చాలాచోట్ల వరిపంటలు ఎండిపోతున్నాయి. నీరందక చేగుంట మండలం పొలంపల్లిలో వరి ఎండిపోతుంది. దీనికి తోడు ఎండలు సైతం ముదరడంతో వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రామంలో దాదాపు 20 ఎకరాల వరి బీటలు బారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.