News June 14, 2024
ప్రజావాణి పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించాలి: కలెక్టర్
అర్జీలపై తక్షణమే స్పందిస్తూ, సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజావాణి కార్యక్రమం పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలకు సంబంధించి రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 10, 2025
NZB: చైనా ఫోన్లా రేవంత్ రెడ్డి పాలన: కవిత
KCR పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఐఫోన్‌కు, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉంటదో.. కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బురిడి కొట్టించారని ధ్వజమెత్తారు.
News February 10, 2025
NZB: BRS దుకాణం క్లోజ్: PCC అధ్యక్షుడు
తెలంగాణలో BRS దుకాణం క్లోజ్ ఆయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. BRSలో KTR- కవిత-హరీశ్ రావు మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని వ్యాఖ్యానించారు. సోమవారం PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని పశ్నించారు. కులగణన సర్వేలో పాల్గొనని KTR ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదన్నారు.
News February 10, 2025
బాల్కొండ: కాలువలో వ్యక్తి గల్లంతు.. వివరాలు ఇవే!
బాల్కొండ మండలం బుస్సాపూర్‌లోని ఇందిరమ్మ కాలువలో పడి <<152100>>వ్యక్తి<<>> గల్లంతయిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బీర్ సింగ్ మారాబి(40) బస్సాపూర్లో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కాగా ఆదివారం తన ఫోన్ రిపేర్ చేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆదివారం నీటిని నిలిపివేశారు.