News November 27, 2024
ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త: మంత్రి సవిత
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. ఇందుకోసం ఎంఎస్ఎంఈ, ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ రుణాలు అందజేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 5 ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News November 27, 2024
నేమకల్లులో పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం
అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యటించారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు నేమకల్లు గ్రామంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలీ ప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు.
News November 27, 2024
ఆదినారాయణరెడ్డి, జేసీ తీరుపై సీఎం ఆగ్రహం!
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల తీరుపై <<14720394>>సీఎం<<>> చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లైయాష్ తరలింపు విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొనడంతో జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
News November 27, 2024
తాడిపత్రిలో రైలు కిందపడి తల్లీకొడుకు ఆత్మహత్య
తాడిపత్రి రైల్వే స్టేషన్-చల్లవారిపల్లి మధ్య తల్లీకొడుకు నారాయణమ్మ, శ్రీనివాసులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై నాగప్ప చెప్పారు. పెద్దపప్పూరు మండలం తబ్జూల గ్రామానికి చెందిన నారాయణమ్మ, శ్రీనివాసులు కుటుంబ కలహాల కారణంగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.