News April 3, 2025
ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలి: మంత్రి జనర్సింహ

అందోల్: ప్రతి పేదవాడి వరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ గంజ్ ప్రాంతంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనంతరం మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామన్నారు.
Similar News
News April 10, 2025
రావులపాలెం: పండ్ల వ్యాపారి కిడ్నాప్ కలకలం

రావులపాలెం సమీపంలోని రావులపాడులో శ్రీకృష్ణ లాడ్జి యజమాని, జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు, హోల్ సేల్ పండ్ల వ్యాపారి సుబ్బారావును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల కారణంగా కిడ్నాప్ చేసినట్లు స్థానికులు అంటున్నారు. రావులపాలెం ఆదిలక్ష్మి నగర్ 5వ వీధిలో బైక్ అడ్డుపెట్టి కారులో అతడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 10, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లాకు వర్ష సూచన

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. BNG, NLG, SRPT జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News April 10, 2025
ఈ నెల 17న ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల కానున్నాయి. నిన్నటితో బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్షలు ముగిశాయి. తొలి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, 17న రెండో సెషన్ రిజల్ట్స్ రానున్నాయి. ఈ నెల 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. మే 18న ఈ పరీక్ష జరగనుంది.