News March 20, 2024
ప్రతి మహిళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

నల్గొండ జిల్లా సమాఖ్య భవనంలో పార్లమెంటు ఎన్నికల స్వీప్ కార్యక్రమాలలో భాగంగా క్రమబద్ధమైన ఓటరు విద్య పై మహిళా సంఘాలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు కలిగిన ప్రతి మహిళ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, అడిషనల్ DRDO శారద పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
ఒకే కాన్పులో ముగ్గురు జననం

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండటంతో ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు.
News April 20, 2025
NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్‌కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు
News April 20, 2025
MGU తరఫున ప్రాతినిధ్యం వహించనున్న ప్రవళిక

ఒరిస్సా కళింగ విశ్వవిద్యాలయం వేదికగా జరగనున్న ఇండియన్ యూనివర్సిటీస్ ఎంపికలకు మహిళా విభాగం 100, 200 మీటర్ల పరుగు పందేనికి NLG సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎన్.ప్రవళిక MGU తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇవాళ ఉదయం విశ్వవిద్యాలయంలో జరిగిన ఎంపికల్లో ప్రవళిక 100 మీటర్ల పరుగు పందెంలో 12.30 సెకండ్లలో, 200 మీటర్ల 25.60 సెకండ్లలో పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.