News March 5, 2025
ప్రతి రైతుకు రూ.20,000 అందిస్తాం: అచ్చెన్న

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20వేలు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మ్యానిఫేస్టోలో చెప్పినట్లుగానే అర్హత కలిగిన రైతులకు సహాయాన్ని అందజేస్తామని ఆయన అన్నారు.
Similar News
News March 6, 2025
శ్రీకాకుళం: 18 షాపులు కేటాయింపు

పారదర్శకంగా లాటరీ పద్ధతిలో 18 బ్రాందీ షాపులు కేటాయించినట్లు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో లాటరీ పద్ధతిలో గీత కార్మికులకు, సొండి కులస్థులు సమర్పించిన ధ్రువపత్రాల ప్రకారం ఆయా కేటగిరిలో కేటాయించామన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.
News March 6, 2025
ఆమదాలవలసలో భారీ లారీ బీభత్సం

ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామం దగ్గర బుధవారం లారీ బీభత్సం సృష్టించింది. పాలకొండ రోడ్డులో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉండే కిరాణా షాప్స్ మీదకి దూసుకెళ్లింది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కిరాణా షాపుల ఫ్లెక్సీ బోర్డులు పూర్తిగా ధ్వంసమయ్యాయి . లారీ డ్రైవర్ మద్యం తాగి నడిపినట్లు షాపు యజమాని చెబుతున్నాడు.
News March 6, 2025
ఇచ్ఛాపురం: మద్యం దుకాణాలకు ఎంపిక నేడు

ఇచ్చాపురం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలకు అభ్యర్థులను గురువారం రోజున లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా.. జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కాలేజీ రోడ్డు అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉ.8 గం.లకు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారు ఎంట్రీపాస్, ఆధార్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ తేవాలన్నారు.