News February 9, 2025
ప్రత్తిపాడు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.
Similar News
News December 18, 2025
RR: సొంత ఇలాఖాలో MLAల డీలా!

సొంత ఇలాఖాలో MLAలు డీలా పడ్డట్లు GP ఎలక్షన్స్ స్పష్టంచేస్తున్నాయి. షాద్‌నగర్ MLA నియోజకవర్గం సహా స్వగ్రామంలో ప్రభావం చూపలేకపోయారు. పలు మండలాల్లో BRS హవా నడిచింది. చేవెళ్లలో 16 గెలిచినప్పటికీ 10 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో గెలిచింది. రాజేంద్రనగర్ MLA ప్రకాశ్‌గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న శంషాబాద్‌లోనూ అతితక్కువ ఓట్లతోనే గెలిచింది. అలాగే ఫ్యూచర్ సిటీ పరిసర గ్రామాల్లోనే వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.
News December 18, 2025
KTDM: ఒక్క ఓటుతో సర్పంచ్.. ట్విస్ట్ ఏంటంటే..!

జూలూరుపాడు మండలం నల్లబండ బోడు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గెలిచిన గడిగ సింధు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిన్నటి ఫలితాల్లో BRS బలపరిచిన అభ్యర్థిగా ఒకే ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఫలితం వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారిని జిల్లా పార్టీ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులకు కృషి చేస్తానని సర్పంచ్ చెప్పారు.
News December 18, 2025
సీఎం చంద్రబాబుకు అవార్డు ఏపీకి గర్వకారణం: మంత్రి టీజీ

సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి టీజీ భరత్. ఈ అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘దార్శనికత విశ్వాసాన్ని సృష్టిస్తుంది. విశ్వాసం పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుంది’ అంటూ భరత్ ట్వీట్ చేశారు. ఏపీకి ఇది గర్వకారణమైన క్షణం అన్నారు. సీఎం చంద్రబాబు బలమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు.


