News January 28, 2025

ప్రత్యేక అలంకరణలో శంబర పోలమాంబ

image

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ భక్తులకు ప్రత్యేక దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన జాతరలో భాగంగ సిరిమానోత్సం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలమాంబ అమ్మవారిని వనంగుడి, చదురుగుడి ఆలయాల్లో ప్రత్యేకంగా అలంకరించారు. రెండు ఆలయాలు పూలు, విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి. వేకువజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Similar News

News March 13, 2025

ఓటేరు చెరువును కాపాడుతాం: నారాయణ

image

భూ ఆక్రమణదారుల నుంచి ఓటేరు చెరువును కాపాడి తీరుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తేల్చి చెప్పారు. చెరువు ఆక్రమణ తొలగించే వరకు పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి ఓటేరు చెరువును నారాయణ పరిశీలించారు. అక్కడ చెరువు ఆక్రమణను చూసి ఆయన మండిపడ్డారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే చెరువును పూడ్చేందుకు కబ్జాదారులు యత్నించిన వైనాన్ని ఆయనకు సీపీఐ, సీపీఎం, ఆర్పీఐ నాయకులు వివరించారు.

News March 13, 2025

ప్రభుత్వ సేవలకు లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలి: కలెక్టర్

image

మహిళా సంఘాల సభ్యులతో ఎంఎస్ఎమ్ఈల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను బుధవారం ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎం అధ్యక్షతన నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలని సూచించారు.

News March 13, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

error: Content is protected !!