News April 6, 2024
ప్రపంచ కుబేరుల జాబితాలో మన పాలమూరు వాసులు

ప్రపంచ కుబేరుల జాబితాలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసి లిస్ట్‌లో మన పాలమూరుకు చెందిన ఇద్దరు అత్యంత ధనవంతులుగా నిలిచారు. మై హోం గ్రూపు వ్యాపార సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు 2.3 బిలియన్ డాలర్ల(రూ.19 వేల కోట్లు)తో 1438 స్థానం, MSN ఫార్మా సంస్థ అధినేత ఎం.సత్యనారాయణ రెడ్డి 2 బిలియన్ డాలర్ల (రూ.16 వేల కోట్లు)తో 1623 స్థానంలో ఉన్నారు.
Similar News
News April 21, 2025
నారాయణపేట: OYO రూమ్‌లో యువకుడి సూసైడ్

NRPT జిల్లా గుండుమాల్ వాసి కుమ్మరి రాజేశ్(22) HYDలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమ్మరి రాజేశ్ HYD అంబర్‌పేట్ పరిధి రామ్‌నగర్‌లో ఉంటూ ప్రెవేట్ జాబ్ చేస్తూ పీజీ ఎంట్రెన్స్‌కు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రేమ విఫలం కావడంతో రామ్‌నగర్‌లోని ఓయో హోటల్ రూమ్‌లో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ బాలరాజ్ తెలిపారు.
News April 21, 2025
MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అడ్డాకుల 20.5 మిల్లీమీటర్లు, మిడ్జిల్ మండలం దోనూరు 14.3 మిల్లీమీటర్లు, మూసాపేట మండలం జానంపేట 6.0 మిల్లీమీటర్లు, కౌకుంట్ల 3.8 మిల్లీమీటరు బాలానగర్ మండలం ఉడిత్యాల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో వరి కోతలకు పొలం తడి ఆరడం లేదన్నారు.
News April 21, 2025
MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 43.3 డిగ్రీలు, నవాబుపేట 43.2, అడ్డాకుల 42.5, మహమ్మదాబాద్ 42.4, దేవరకద్ర 41.8, చిన్నచింతకుంట మండలం నంది వడ్డేమాన్ 41.6, కౌకుంట్ల 41.3, కోయిలకొండ మండలం పారుపల్లి 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.