News March 13, 2025

ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.

Similar News

News March 13, 2025

రోహిత్ శర్మ ఎందుకు రిటైరవుతారు?: డివిలియర్స్

image

రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించారు. ‘ప్రస్తుతం రోహిత్ ఆట మామూలుగా లేదు. కెప్టెన్సీ కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఇలాంటి దశలో ఆయనెందుకు రిటైరవుతారు? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆడిన తీరు అసాధారణం. నాయకుడిగా ముందుండి నడిపించారు. రిటైర్ కావడానికి కారణమే లేదు. ఆయనపై విమర్శలకూ స్కోప్ లేదు. ఆయన రికార్డులే ఆ మాట చెబుతాయి’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

నంద్యాల: బొలెరోతో ఢీకొట్టి.. చోరీ

image

బేతంచర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జస్వంత్ నంద్యాలలో బైక్‌ను కొనుగోలు చేసి బేతంచర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ్మరాజు పల్లె ఘాట్ వద్ద దుండగులు జస్వంత్ బైకును బొలెరోతో ఢీ కొట్టారు. జస్వంత్ కిందపడిపోగా అతని చేతికి ఉన్న 4 తులాల బ్రేస్‌లెట్, 2 ఉంగరాలను బొలెరోలో వచ్చిన ముగ్గురు దొంగలు దోచుకున్నారు. ఘటనపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 13, 2025

తుళ్లూరు: మైక్రోసాఫ్ట్‌తో లోకేశ్ కీలక ఒప్పందం

image

రాష్ట్రంలోని యువతకు ఎఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్‌తో ఎపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం మంత్రి లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తుందని లోకేశ్ తెలిపారు.

error: Content is protected !!