News October 2, 2024
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి మెడిసిన్ సీటు

బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి స్వర్ణకారుడిగా పని చేస్తున్నారు. కాగా, కలీమ్ GOVT జూనియర్ కళాశాలలో చదివి సీటు సాధించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Similar News
News March 11, 2025
ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) అపర్ణ డిస్మిస్ చేశారు. మరోవైపు బెయిల్ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేశారు. నేడు వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత ఫిర్యాదుతో గతేడాది ఆదోని పీఎస్‌లో పోసానిపై కేసు నమోదైంది.
News March 11, 2025
పోలీస్ పిజిఆర్ఎస్ కు 122 ఫిర్యాదులు : జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపేట వద్ద ఉన్న సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిశీలించి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
News March 10, 2025
కర్నూలు జిల్లాలో 349 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు 349 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 18,481 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 18,132 మంది హాజరయ్యారు. 349 విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదు.