News April 16, 2025
ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు: జేసీ కార్తీక్

నెల్లూరు నగరంలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ కార్తీక్ అధికారులు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.
Similar News
News April 16, 2025
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 107 పోస్టుల మంజూరు

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కొత్తగా 107పోస్టులు రానున్నాయి. వీటిలో 63 ఎస్‌జీటీ, 44 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 105 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 61 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 44 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.
News April 16, 2025
నెల్లూరు: మెప్మా పీడీగా లీలారాణి

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) నెల్లూరు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా డిప్యూటీ కలెక్టర్ బి.లీలారాణి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. లీలారాణి గతంలో జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్‌గా, గూడూరు, కోట మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాజంపేట భూసేకరణ విభాగంలో పనిచేస్తున్నారు. బదిలీపై నెల్లూరు రానున్నారు.
News April 16, 2025
ఇంకా పరారీలోనే మాజీ మంత్రి కాకాణి

YCP నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేసులు వెంటాడుతున్నాయి. పొదలకూరు(M) వరదాపురం వద్ద రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వి రూ.250కోట్లు దోచేసిన కేసులో 13 మందిపై కేసులు నమోదు చేశారు. కాకాణి A4గా ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదు. కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో 7బృందాలతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.