News February 9, 2025
ప్రయాగరాజ్‌కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు
ఆర్టీసీ గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు గుంటూరులో బస్సు బయలుదేరుతుందన్నారు.
Similar News
News February 10, 2025
గుంటూరు: LLB పరీక్షల ఫలితాల విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన LLB 2వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. LLB కోర్సు పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
News February 10, 2025
కాకుమానులో ప్రమాదాలు.. ఇద్దరి మృతి
కాకుమాను మండలంలో సోమవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తి ఘటన స్థలంలో మృతి చెందాడు. మండలంలోని కొండపాటూరు గ్రామంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు క్రాంతి కుమార్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2025
తాడేపల్లి: జగన్ ఇంటి వద్ద కెమెరాలు
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మానిటర్ చేయనున్నారు.