News March 13, 2025
ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండుగను శుక్రవారం ఉదయం 6:00 గంటల నుంచి మ.12 గంటల వరకు చేసుకోవాలని సురక్షితమైన రంగులను ఉపయోగించాలని హానికరమైన రసాయనాలను రంగులను వాడకూడదని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం కఠినంగా నిషేధిస్తున్నాని, అలాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
ఆ పాత సామాను ఎవరు?

అవసరమైతే పార్టీపైనే విమర్శలు చేసే BJP MLA రాజాసింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాషాయ దళంలోని పాత సామాను బయటకు వెళ్లాలన్నారు. కొన్ని సామాజిక వర్గాల్లోని కొందరు పార్టీని సొంత జాగీరుగా భావిస్తున్నారని ఆరోపించారు. దీంతో నాయకుల్లో రెడ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్ర కమలదళ నేతల్లో ఎవరిని ఉద్దేశించి గోషామహల్ నేత ఈ పాత సామాను కామెంట్లు చేశాడని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది.
News March 13, 2025
రాష్ట్రంలోనే రెండో స్థానంలో గోదూర్

జగిత్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరులో 40.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో గోదూర్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అటు మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జరుగుతున్నారు.
News March 13, 2025
జగిత్యాల: కొడుకుపై ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు

తమ కుమారులు తమను పోషించడం లేదని మల్లెల మండలం పోతారం గ్రామానికి చెందిన చిన్న నిమ్మ నర్సయ్య- భూమక్క అనే వృద్ధ దంపతులు గురువారం జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ను ఆశ్రయించారు. తాము కట్టించిన ఇండ్లలో తమకు చోటు ఇవ్వడంలేదని, తమకు తిండి సరిగా పెట్టడం లేదని, బిపి, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నామని రోదిస్తూ చెప్పారు. ఈ విషయమై అడిగితే కొడుకు, కోడలు కొడుతున్నారని ఫిర్యాదు చేశారు. వారి వెంట హరి, అశోక్ కుమార్ ఉన్నారు.