News March 30, 2025
ప్రశాంతంగా కొనసాగుతున్న ఫకీర్ షావలి జాతర

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో ఫకీర్ షా వలి జాతర ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. హిందూ, ముస్లింలు సంయుక్తంగా జరుపుకొంటున్న ఈ జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎల్కతుర్తి ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News April 2, 2025
కర్ణాటకలో ఓలా, ఉబెర్, ర్యాపిడో బైక్స్‌పై నిషేధం

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. మోటార్ వాహనాల చట్టం(1988)లోని సెక్షన్-93ని అనుసరించి ప్రభుత్వం నిబంధనల్ని ఏర్పాటు చేసేవరకూ ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలు తిరగడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులివ్వాలని ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.
News April 2, 2025
RBI డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా

దశాబ్దకాలం తర్వాత RBI డిప్యూటీ గవర్నర్‌గా మహిళ నియమితులయ్యారు. ప్రముఖ ఎకానమిస్ట్ పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో 20 ఏళ్లపాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆమె సొంతం. భారత ప్రభుత్వ అడ్వైజర్‌గా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్(NCAER) డైరెక్టర్‌గానూ సేవలందించారు. RBI మానిటరీ పాలసీ కమిటీలో పూనమ్ చేరనున్నట్లు తెలుస్తోంది.
News April 2, 2025
నారాయణపేటలో నేషనల్ EMT DAY వేడుకలు

108లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నందుకుగాను ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండో తేదీన నేషనల్ EMT DAY వేడుకలు ఘనంగా నిర్వహిస్తోందని MBNR జిల్లా ప్రోగ్రాం అధికారి రవికుమార్, NRPT జిల్లా సూపర్‌వైజర్ రాఘవేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.