News April 6, 2024
ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు

JEE మెయిన్స్ సెషన్-2 పరీక్షలు ఉమ్మడి పాలమూరులో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఫాతిమా విద్యాలయంలో ఉదయం పూట నిర్వహించిన పరీక్షకు 147మందికి గాను 135మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 147మందికి గాను 134మంది హాజరయ్యారు. ధర్మాపూర్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 180మందికి గాను 158మంది, మధ్యాహ్నం 180కి గాను 162 మంది హాజరయ్యారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులు 9 మందికి 1 గైర్హాజరయ్యారు.
Similar News
News April 21, 2025
MBNR: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో MBNR,NRPT,GDWL,WNP,NGKLలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281
News April 21, 2025
MBNR: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో MBNR,NGKL,WNP,GDWL,NRPTలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
News April 21, 2025
MBNR: ‘విద్యా వ్యవస్థను బలోపితం చేస్తాం’

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో విద్యావ్యవస్థను బలోపితం చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. బీటీఏ నేత బాల పీరు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలైన బదిలీలు, ప్రమోషన్స్, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.