News April 8, 2024
ప్రాణం ఉన్నంతవరకు జగన్‌తోనే ఉంటా: VSR

ప్రాణం ఉన్నంతవరకు తాను CM జగన్‌తోనే ఉంటానని వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR) అన్నారు. 35 ఏళ్లుగా జగన్ కుటుంబంతో ఉన్నానని.. ఇకపై కూడా ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఆ కుటుంబంతో తన బంధం శాశ్వతమని పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతుల్లా తనకు వెన్నుపోటు పొడవడం, పార్టీలు మారడం తెలియదన్నారు. విడవలూరు రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News March 17, 2025
నెల్లూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో 174 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు SP తెలిపారు. 33,434 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు.
News March 17, 2025
పేట్రేగుతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.5కోట్లు దోచేశారు

నెల్లూరు జిల్లాలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. నెల రోజుల్లో దాదాపు రూ.5కోట్లు దోచేసినట్లు సమాచారం. డాక్టర్లు, ఆడిటర్లు, రిటైర్డ్ టీచర్లే లక్ష్యంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు అంటూ భయపెడుతూ యథేచ్చగా అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల CBI అధికారినంటూ ఓ వ్యక్తి వద్ద కోటికి పైగా దోచేసిన విషయం తెలసిందే. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News March 17, 2025
నెల్లూరు : 174 కేంద్రాలు…33,434 మంది విద్యార్ధులు

నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DEO బాలాజీ రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 174 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 33,434 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందు రావాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్ష బాగా రాయాలన్నారు.