News March 22, 2025

ప్రారంభమైన కాజీపేట-విజయవాడ (MEMU) ట్రైన్

image

కాజీపేట నుంచి డోర్నకల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్లే (MEMU) ట్రైన్ నంబర్ 67269) ఈరోజు నుంచి ప్రారంభమైంది. ట్రైన్ ఉ.6:40 ని.లకు బయలుదేరి మధ్యాహ్నం 12: 00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మూడో లైన్ పనులు, కారణాల వల్ల కొంతకాలంగా ఈ ట్రైన్ నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో ఈ రైలును మళ్లీ పునరుద్ధరించారు.

Similar News

News March 25, 2025

WGL: మార్కెట్‌లో సరుకుల ధరలు ఇలా..

image

ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి క్వింటాకి నిన్న రూ.10,500 ధర పలకగా.. నేడు రూ.10,800 పలికింది. అలాగే టమాటా మిర్చికి నిన్న రూ.26,500 ధర రాగా..నేడు రూ.28వేలు వచ్చింది. సింగిల్ పట్టికి రూ.27వేలు (నిన్న 26వేలు), దీపిక మిర్చి రూ.13,300(నిన్న రూ.22,500) ధర ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2265(నేడు రూ.2250) పలికిందన్నారు.

News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 25, 2025

భీమదేవరపల్లి: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!