News February 6, 2025

ప్రియాంక గాంధీని కలిసిన పెద్దపల్లి ఎంపీ

image

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, యువతకు ఉపాధి అవకాశాలు, ప్రత్యేక నిధుల కేటాయింపుల గురించి ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 7, 2025

మంత్రులకు ర్యాంకులు.. వారికి అంబటి కంగ్రాట్స్

image

AP: ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన <<15380097>>ర్యాంకులపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘మంత్రివర్గపు ర్యాంకులలో 8, 9 స్థానాలను సాధించిన లోకేశ్, పవన్‌లకు అభినందనలు!’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు 10వ ర్యాంకు వచ్చిందని పలువురు కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా వీరిద్దరికే శుభాకాంక్షలు చెప్పడం వెనుక వ్యంగ్యం ఉందని పేర్కొంటున్నారు.

News February 7, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 7, 2025

కోటగిరి: ఎత్తోండ క్యాంపులో అక్రమ ఇసుక డంపులు

image

కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపును అడ్డగా మలుచుకున్న కొందరు ఇసుక సూరులు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గల ఖాళీ స్థలంలో ఇసుక డంపులు చేసి రాత్రికి రాత్రి వాటిని టిప్పర్ల ద్వారా బోధన్, నిజాంబాద్ పట్టణాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ విషయమై గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడంలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!