News April 14, 2025
ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర..!

వివాహేతర సంబంధంతో ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపురం హవేలీ సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన కథనం ప్రకారం.. ముదిగొండ (మం) సువర్ణపురంకు చెందిన ధర్మ భార్యతో.. రామాంజనేయులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎలాగైనా ప్రియురాలి భర్త(ధర్మ)ను అడ్డు తొలగించాలని తన స్నేహితులతో కుట్ర చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Similar News
News April 17, 2025
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్

AP: ఎస్సీ వర్గీకరణ-2025కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఇటీవల ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News April 17, 2025
రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?

TG: ఇటీవల బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్ మినహా రూ.500కు పైగా ధర ఉండే లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంచనున్నట్లు సమాచారం. దీని ప్రకారం బాటిల్‌పై మినిమమ్ రూ.50 పెరిగే అవకాశముంది. ఆయా బాటిళ్ల ఎమ్మార్పీ ఆధారంగా రేట్లు పెరగనున్నాయి. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News April 17, 2025
పలాయనం చిత్తగించిన కూటమి నేతలు: రోజా

AP: దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని ట్వీట్లు చేసిన కూటమి నేతలు ఫోన్ ఎత్తకుండా పలాయనం చిత్తగించారని వైసీపీ నేత రోజా ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ప్రూఫ్‌లతో సహా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఛాలెంజ్‌లు విసరకూడదని ఆమె మండిపడ్డారు. తిరుపతిలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమ నేతల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు.