News December 2, 2024

ప్రేమ పేరుతో మోసం.. ఆదోనిలో ప్రియుడి కుటుంబంపై కేసు

image

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఆదోనిలో కేసు నమోదైంది. సీఐ శ్రీరామ్ వివరాల మేరకు.. ఆదోనికి చెందిన గురుప్రసాద్ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మైసూరు యువతి చందన పరిచయమైంది. ఇరువురూ ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత యువకుడు పెళ్లికి నిరాకరించారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడితోపాటు కుటుంబ సభ్యులపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Similar News

News December 27, 2024

టీజీ భరత్ కుమార్తె పెళ్లిలో చిరంజీవి, బాలకృష్ణ

image

మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్యపాన్య వివాహ వేడుక హైదరాబాదులోని GMR అరేనలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, హీరో బాలకృష్ణ హాజరై సందడి చేశారు. నూతన వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి ఫరూక్, పలువురు ఎమ్మెల్యేలు బాలయ్యతో ముచ్చటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

News December 26, 2024

మంత్రి భరత్ కుమార్తె పెళ్లిలో సీఎం చంద్రబాబు

image

మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. హైదరాబాదులోని GMR అరేనలో జరిగిన ఈ వేడుకకు హాజరై వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్‌ను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

News December 26, 2024

శ్రీశైలానికి మంత్రి కొండా సురేఖ రాక

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి నేడు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రానున్నట్లు దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. రాత్రి 7 గంటలకు మంత్రి శ్రీశైలం చేరుకుంటారని చెప్పారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.