News March 20, 2025
ప్రేమ విఫలం.. ధర్మవరంలో యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ధర్మవరం పట్టణం గిర్రాజు కాలనీకి చెందిన బద్దెల ఓబునాథ్ (35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందిన వివరాల మేరకు.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. నిరాకరించిందని మనస్తాపం చెంది గురువారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓబునాథ్ టైల్స్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపిస్తున్న మృతుడి బంధువులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న మృతుడి బంధువులు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
విజయవాడ: అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం కేసులు న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు.. వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ బాలికతో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(19) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడి గర్భవతిని చేసి మోసం చేశాడు. విచారించిన న్యాయస్థానం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 30వేల జరిమాన విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.