News February 14, 2025

ప్రేమికులు తస్మాత్ జాగ్రత్త: బజరంగదళ్

image

వాలంటైన్స్ డే పేరు చెప్పుకొని విచ్చలవిడిగా తిరిగే ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలని గుంటూరు జిల్లా బజరంగదళ్ నాయకులు హెచ్చరించారు. ఫిబ్రవరి 14 అంటే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మన జవాన్లు దారుణంగా మృతిచెందిన రోజని చెప్పారు. ఇది సంతాపదినమే కానీ ప్రేమికుల దినోత్సవం కాదన్నారు. విచ్చలవిడితనానికి, లవ్ జిహాదీకి తాము వ్యతిరేకమని, ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణగా ఉంటామన్నారు.

Similar News

News March 12, 2025

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని కొత్తపేట పోలీసులు తెలిపారు. జీజీహెచ్ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద వ్యక్తి చనిపోయాడని సెక్యూరిటీ గార్డు కొత్తపేట పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 12, 2025

గుంటూరు జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణను పల్నాడుకు, కృతిక శుక్లాను బాపట్ల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 12, 2025

గుంటూరు మిర్చి ఘాటున్నా.. రేటు లేదు !

image

ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డులో మిర్చి ఘాటైతే ఎక్కువగా ఉంది కానీ రేటు మాత్రం లేదు. రైతులు ఆరుగాలం శ్రమించినా సరైన గిట్టుబాటుధర లభించక ఇబ్బందులు పడుతున్నారు. గత సీజన్‌లో రూ.25.వేలు పలికిన క్వింటా ఈ ఏడాది రూ.11వేలకు కూడా పలకనంటొంది. కేంద్రం రూ.11,781 చెల్లిస్తామని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా చెప్పినప్పటికీ రైతులు ఏ మాత్రం సంతృప్తి చెందడం లేదు. రైతులు క్వింటాకి రూ.20వేలు ఆశిస్తున్నారు.

error: Content is protected !!