News March 30, 2025

ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలు ఆపే అధికారం లేదు: DSP

image

ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలు ఆపే అధికారం లేదు అని డిఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. బోరజ్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న ఒక ఎంవీఐ అధికారి, ప్రైవేట్ డ్రైవర్ యుగంధర్చ ప్రైవేట్ వ్యక్తి వాహనాలు ఆపి ధ్రువపత్రాల అడగ్గా హైవే పెట్రోల్ గమనించి జైనథ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులు వాహనాలు ఆపిన, డబ్బులు వసూలు వారిపై చర్యలు తప్పవన్నారు.

Similar News

News April 3, 2025

ADB: ‘మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించాలి’

image

మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులు, సంఘ నాయకులకు సూచించారు. బాబూ జగ్జీవన్ రాం, బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు సంబంధించి బుధవారం నిర్వహించిన ఆదిలాబాద్ కలెక్టరేట్లో సన్నాహక సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5న బాబు జగ్జీవన్‌రామ్‌ 118వ జయంతి, 14న బీఆర్‌ అంబేడ్కర్ 134వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామన్నారు.

News April 2, 2025

ADB: వేధింపులా.. 8712659953కి కాల్ చేయండి: SP

image

మహిళలు, విద్యార్థినులకు ఉద్యోగస్థలాల్లో, కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, వేధింపులకు గురైనా జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. షీ టీం బృందాలను సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ 8712659953ను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో గత నెలల్లో 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటిలో 3 కేసులు, మావల పీఎస్‌లో ఒక FIR నమోదు చేసినట్లు చెప్పారు.

News April 2, 2025

ఉట్నూర్: అస్వస్థతతో ఉపాధి కూలీ మృతి

image

అస్వస్థతకు గురై ఉపాధి కూలీ మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలు.. ఉట్నూర్ (M) అందోలికి చెందిన పారేకర్(34) 3 వారాలుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు పని చేసి ఇంటికి చేరుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి అతడికి వాంతులు, విరోచనాలు, ఛాతిలో నొప్పి రావడంతో ఇంద్రవెల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ADBకి తరలించే క్రమంలో మృతిచెందాడు. ఎండ తీవ్రతతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.

error: Content is protected !!