News January 3, 2025
ప్రొద్దుటూరు: 184 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
రూరల్ పరిధిలోని ఆటోనగర్లో అక్రమంగా నిలువ ఉంచిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. రూరల్ పోలీసులు అందించిన సమాచారం మేరకు ఒక రూమ్‌లో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో గంగయ్య, డీటీ మల్లికార్జున, ఇతర అధికారుల సమక్షంలో పంచనామా చేసి అక్రమ బియ్యాన్ని సీజ్ చేశారు.
Similar News
News January 7, 2025
కడప జిల్లా ప్రజలు భయపడకండి: డాక్టర్లు
కడప జిల్లాకు సమీపంలో ఉన్న బెంగళూరులో HMPV కేసు నమోదైంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు రానున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కడప రిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని అన్నారు.
News January 7, 2025
కడప: కులగణన అభ్యంతరాలకు నేడే చివరి రోజు
కుల గణనకు సంబంధించి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అభ్యంతరాల స్వీకరణ నేటితో ముగియనుంది. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి సరస్వతి తెలిపారు. కులగణన అభ్యంతరాలు ఇంకా ఉండిఉంటే, తగిన ఆధారాలతో సచివాలయాలకు వెళ్లాలన్నారు. కాగా దీనికి సంబంధించిన తుది జాబితాను జనవరి 17న సచివాలయాల్లో ప్రదర్శించనున్న విషయం తెలిసిందే.
News January 7, 2025
కడప: జాతీయ యూత్ ఫెస్టివల్‌కు ఎంపికైన సానియా
దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి సానియా ఎంపికైనట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి మణికంఠ పేర్కొన్నారు. జనవరి 10 నుంచి 12 వరకు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో నేషనల్ యంగ్ లీడర్ షిప్ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సానియా ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు.