News July 25, 2024
ప్రొద్దుటూరు: 31న పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 31న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎంవీసీహెచ్ జగదీశ్వరుడు తెలిపారు. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ కోర్సులలో మొదటి సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. 10వ తరగతి పాసై ఆసక్తి గల విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని కోరారు.
Similar News
News December 21, 2024
కడప: 1991 నాటి YS జగన్ ఫొటో వైరల్
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇంటర్నెట్లో ఓ ఫొటో వైరల్ అవుతుంది. 1991లో జగన్ తీసుకున్న ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్థానికంగా ఉన్న వ్యక్తితో ఫొటో దిగగా తాజాగా ఆ ఫొటో బయటకు వచ్చింది. శనివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టును ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు.
News December 21, 2024
కడప జిల్లాకు క్యూ కట్టిన మంత్రులు
కడప జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులు క్యూ కట్టారు. ఆదివారం నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మలరామానాయుడు గండికోట ప్రాజెక్టును సందర్శించనున్నారు. అలాగే పర్యాటకం, సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్మలమడుగు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.
News December 21, 2024
ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలి: కడప కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కడప జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసే ఆకాంక్షతో జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లతో నీతి ఆయోగ్ సీఈవో వీసీ ద్వారా శుక్రవారం సమీక్షించారు. సంబందిత శాఖలు అన్ని పారామీటర్లు 100% లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.