News August 20, 2024

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకు ఛైర్మన్‌గా బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి

image

ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ పదవి TDP ఖాతాలోకి చేరింది. YCP తరఫున ఉన్న ఛైర్మన్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఛైర్మన్ పదవికి సోమవారం ఎన్నికలు జరిగాయి. TDP అభ్యర్థిగా 4వ డైరెక్టర్ బొగ్గుల వెంకటసుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈయనకు పోటీగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఛైర్మన్‌గా వెంకట సుబ్బారెడ్డి ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఎ.రాజశేఖర్ ప్రకటించారు.

Similar News

News January 15, 2025

యర్రగుంట్లలో సంక్రాంతి రోజు అపశ్రుతి

image

యర్రగుంట్లలోని 5వ వార్డులో జయంత్‌ అనే ఐదేళ్ల బాలుడు విద్యుత్ తీగలు తగిలి మంగళవారం గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే నాగిరెడ్డి ఇంటిపై 33KV విద్యుత్ తీగలు కిందికున్నాయి. ఆ మిద్దెపైన ఆడుకుంటున్న జయంత్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు బాబును ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఇదే క్రమంలో నాగిరెడ్డి ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి నష్టం వాటిల్లింది.

News January 15, 2025

ఎర్రగుంట్లలో సంక్రాంతి రోజు అపశ్రుతి

image

ఎర్రగుంట్లలోని 5వ వార్డులో జయంత్‌ అనే ఐదేళ్ల బాలుడు విద్యుత్ తీగలు తగిలి మంగళవారం గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే నాగిరెడ్డి ఇంటిపై 33KV విద్యుత్ తీగలు కిందికున్నాయి. ఆ మిద్దెపైన ఆడుకుంటున్న జయంత్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు బాబును ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఇదే క్రమంలో నాగిరెడ్డి ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి నష్టం వాటిల్లింది.

News January 15, 2025

కడప రెగ్యులర్ RJDగా శామ్యూల్

image

కడప రెగ్యులర్ RJD (పాఠశాల విద్యాశాఖ)గా కె.శామ్యూల్ నియమితులయ్యారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న కె.శామ్యూల్ కడప జిల్లా RJDగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కడప జిల్లా RJDగా తన విధులను నిర్వహించనున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని వారు తెలిపారు.