News February 15, 2025
ప్రొద్దుటూరు: బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

ప్రొద్దుటూరు స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ గోవింద్ రెడ్డి తెలిపారు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పిన నల్లబోతుల కుల్లాయప్పపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News March 12, 2025
వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో కడప జిల్లా ఎమ్మెల్సీలు

తాడేపల్లెలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అధినేత జగన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ లక్ష్యాలను ఆయన వివరించారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీ పెట్టినట్లు చెప్పారు. వైసీపీ వెన్నంటే నిలిచిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఎమ్మెల్సీలు రమేశ్ యాదవ్, రామ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
News March 12, 2025
దేవాదాయ శాఖలోకి కాశీనాయన ఆశ్రమం..?

కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ శాఖ నిబంధనలు సంక్లిష్టంగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ శాఖ అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు. కాశీనాయన ఆశ్రమాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని ఆదినారాయణ రెడ్డితో పాటు ఇతర MLAల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. సీఎంతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆనం ప్రకటించారు.
News March 12, 2025
కడప: యూత్ పార్లమెంట్ పోస్టర్లు ఆవిష్కరించిన JC

జాతీయ యూత్ పార్లమెంట్ ఉపన్యాసాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువత ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఉపన్యాసాల ద్వారా యువతలోని ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి మణికంఠ పాల్గొన్నారు.