News January 6, 2025

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో పాటు, అన్ని శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

Similar News

News January 8, 2025

NLG: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి

image

రాష్ట్రంలోని SC, ST, BC, జ‌న‌ర‌ల్‌ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.

News January 8, 2025

AMAZING: తాజ్‌మహల్‌లో నల్గొండ రాళ్లు!

image

తాజ్‌మహల్ నిర్మాణంలో NLG జిల్లా దేవరకొండ ప్రాంతంలో లభించే క్రిస్టల్ క్వార్ట్‌జ్ రాళ్లను(పలుగు రాళ్లు) వాడినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్‌ లైబ్రరీ& రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి రిటైర్డ్‌ లైబ్రేరియన్‌ డిర్లామ్, రీసెర్చ్‌ లైబ్రేరియన్‌ రోజర్స్, సంస్థ డైరెక్టర్‌ వెల్డన్‌ కలిసి అధ్యయనం చేపట్టారు. పర్చిన్‌‌కారి పద్ధతిలో ఈ రాళ్లను తాజ్‌మహల్ పాలరాతిలో అంతర్భాగంగా అమర్చినట్లు గుర్తించారు.

News January 8, 2025

దేవరకొండ: శిశువు మృతి.. బంధువుల ఆందోళన

image

దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకొండ మం. మర్రిచెట్టు తండాకు చెందిన ఓ గర్భిణి మంగళవారం మధ్యాహ్నం ప్రసవం కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు సాధారణ ప్రసవం కోసం వేచి ఉంచి ఈరోజు తెల్లవారుజామున డెలివరీ చేశారు. కాగా శిశువు మృతిచెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.