News March 23, 2025

ఫిలింనగర్‌: తల్లి డైరెక్షన్‌లో కొడుకుల చోరీ

image

ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్‌హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్‌తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.

Similar News

News March 29, 2025

హైదరాబాద్‌ భగభగ మండుతోంది..!

image

హైదరాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం ముషీరాబాద్ మండలంలో అత్యధికంగా 40.0℃, షేక్‌పేట 39.9, నాంపల్లి 39.9, అంబర్‌పేట్ 39.9, మరేడ్‌పల్లి 39.9, హిమాయత్‌నగర్ 39.9, ఖైరతాబాద్ 39.9, అసిఫ్‌నగర్ 39.9, చార్మినార్ 39.9, బండ్లగూడ 39.9, సైదాబాద్ 39.8, బహదూర్‌పురా 39.5, గోల్కొండ 39.4, సికింద్రాబాద్ మండలంలో 39.4 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.

News March 29, 2025

కూకట్‌పల్లి: డబ్బులు విషయంలో ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తి అదృశ్యం

image

ఇంటి నిర్మాణానికి సంబంధించి EMI కట్టాలంటూ అన్న వదిన వేధిస్తుండడంతో యువకుడు అదృశ్యమైన ఘటన KPHBలో చోటుచేసుకుంది. వంశీకృష్ణ (33), శాలిని దంపతులు కో లివింగ్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. వంశీకృష్ణ సొంత ఊరిలో తన సోదరుడితో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగగా EMI చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు.

News March 29, 2025

ఖైరతాబాద్: సిటీలో 20% వృథా అవుతున్న నీరు

image

వేసవిలో నగరంలో నీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే జలమండలి నగర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న నీటిలో సుమారు 20% వృథా అవుతోంది. అంటే దాదాపు 95 మిలియన్ లీటర్లు (3.5 మిలియన్ గ్యాలన్లు) వేస్టేజ్ అవుతోంది. పైప్‌లైన్ల లీకేజీలు, అనధికార కనెక్షన్ల కారణంగా ఈ నీరు ఇలా అవుతోందని జలమండలి అధికారులు చెబుతున్నారు. 2% సరఫరా లోపం కాగా.. మరో 18% నీటి పంపిణీలో ఉన్న లోపాల కారణంగా వేస్ట్ అవుతోంది.

error: Content is protected !!