News January 2, 2025
ఫూటుగా పెగ్గులెత్తారు!
అనంతపురం జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.5.46 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. అనంతపురం జిల్లాలో రూ.3.87 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.1.59 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News January 7, 2025
‘అనంతపురం జిల్లాలో హెచ్ఎంపీవీ కేసులు లేవు’
చైనాలో గుర్తించిన హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు జిల్లాలో ఎక్కడా నమోదు కాలేదని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఈ బి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. న్యూమో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News January 6, 2025
కూడేరు: రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపిన దున్నపోతు
కూడేరు మండలంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. అమ్మవారికి విడిచిన దున్నపోతు తమదంటే తమదని కడదరకుండ, ముద్దలాపురం గ్రామ ప్రజలు వాదనలకు దిగారు. అయితే ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరింది. దీంతో ఇరు గ్రామాల వారు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
News January 6, 2025
అనంతపురంలో KG టమాటా రూ.6
అనంతపురంలో టమాటా ధరలు బాగా పడిపోయాయి. నిన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.10 పలికిందని రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ వెల్లడించారు. మరోవైపు కనిష్ఠ ధర రూ.6గా నమోదైందన్నారు. మొత్తంగా నిన్న ఒక్కరోజు మార్కెట్‌కు 1050 టన్నులు రాగా సరాసరిగా కిలో టమాటా రూ.8 పలికింది.