News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. పార్థసారథికి 23వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ఏలూరు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి 23వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

Similar News

News February 7, 2025

ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్

image

ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న యాదయ్య దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

News February 7, 2025

నిజామాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో మాక్లూర్‌కు చెందిన షేక్ ఫర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లారీ డ్రైవర్ పరారైనట్లు ఎస్ఐ ఆరీఫ్ వెల్లడించారు.

News February 7, 2025

అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి

image

AP: రాజధాని అమరావతిలో పలు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు ఈసీ అనుమతిచ్చింది. ప్రస్తుతం కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో అమరావతిలో పనులకు అనుమతి ఇవ్వాలని సీఆర్డీఏ ఈసీకి లేఖ రాయగా అభ్యంతరం లేదని బదులిచ్చింది. టెండర్లు పిలవొచ్చని, అయితే ఎన్నికలు పూర్తయ్యాకే ఖరారు చేయాలని పేర్కొంది.

error: Content is protected !!