News March 22, 2025
ఫోన్ చేసి సమస్యలు తెలపండి: నిర్మల్ కలెక్టర్

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం ప్రతి సోమవారం టెలిఫోన్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ప్రజలు తమ ఇంటి నుంచే 91005 77132 నంబర్‌కు కాల్ చేసి నేరుగా తమ సమస్యలను తెలుపవచ్చన్నారు. అలాగే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్‌లో యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు.
Similar News
News December 15, 2025
MLA సురేంద్రబాబుకు హైకోర్ట్ నోటీసుల జారీ

కళ్యాణదుర్గంలో గతంలో జరిగిన ఈ-స్టాంపుల కుంభకోణం మరోసారి వెలుగులోకొచ్చింది. ఈ కుంభకోణంలో రాష్ట్ర హైకోర్టు కళ్యాణదుర్గం MLA సురేంద్రబాబుతో పాటు 12 మందికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరిలోపు వివరణ ఇవ్వాలని కోర్టు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. రూ.100 స్టాంపును రూ.లక్షగా మార్చి వాటి ద్వారా బ్యాంకుల్లో రుణాలు పొందినట్లు గతంలో ఆరోపణలు వినిపించాయి. అవి ఈ నోటీసులతో మరోసారి వెలుగులోకొచ్చాయి.
News December 15, 2025
రేవంత్ ప్రభుత్వంపై కవిత విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కవిత విమర్శలు చేశారు. ‘#AskKavitha’లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘వాగ్దానాలు నెరవేరలేదు. కమిట్మెంట్స్ అన్నీ విఫలమయ్యాయి. ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు’ అని ధ్వజమెత్తారు. హీరో రామ్ చరణ్ గురించి మరొకరు అడగ్గా ‘ఆయన ఎంతో వినయంగా ఉంటారు. గొప్ప డాన్సర్. కానీ నేను చిరంజీవి అభిమానిని కాబట్టి ఆయనే గొప్ప’ అని బదులిచ్చారు.
News December 15, 2025
చిత్తూరు: 43 ఫిర్యాదుల స్వీకరణ

చిత్తూరు జిల్లాలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి 43 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చీటింగ్–3, కుటుంబ తగాదాలు–5, వేధింపులు–3, భూ తగాదాలు–10, ఇంటి తగాదాలు–5, డబ్బు తగాదాలు–8, ఆస్తి తగాదాలకు సంబంధించిన 9 ఫిర్యాదులు అందాయన్నారు.


