News June 13, 2024
ఫోన్ ట్యాపింగ్ బాధ్యులకు కటకటాలే: మంత్రి జూపల్లి
ఫోన్ ట్యాపింగ్‌కు కారణమైన మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులు, రాజకీయ నేతలు కటకటాల్లోకి వెళ్లక తప్పదని పర్యాటక, ఆబ్కారీ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో డా.మల్లురవి విజయం సాధించడంతో బుధవారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే ప్రజా భవన్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా మంత్రి పాల్గొని మాట్లాడారు.
Similar News
News November 18, 2024
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో స్నేహితులు దుర్మరణం
HYD- శ్రీశైలం హైవేపై కడ్తాల్ టోల్ గేట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కడ్తాల్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు రాజు, మహేశ్ మైసిగండి నుంచి కడ్తాల్ వైపు బైక్ పై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్నేహితులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర వషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 18, 2024
నేడు లగాచర్లకు జాతీయ ST కమిషన్ మెంబర్
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగాచర్లకు జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10గంటలకు లగాచర్లకు చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడి మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమావేశం అవుతారు. సాం. 4 గంటలకు సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులతో మాట్లాడి హైదరాబాద్ వెళ్తారు.
News November 17, 2024
PU డిగ్రీ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ విడుదల
పాలమూరు యూనివర్సిటీ(PU) పరిధిలో డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 25 నుంచి వచ్చే నెల 13 వరకు డిగ్రీ 1,3,5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు PU అధికారులు వెల్లడించారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు గమనించాలని కోరారు.