News March 20, 2025
బడ్జెట్.. ఉమ్మడి కరీంనగర్‌కు కేటాయింపులు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో KNR స్మార్ట్ సిటీ పనులకోసం రూ.179కోట్లు కేటాయించింది. అదేవిధంగా SUకి రూ.35కోట్లు, స్పోర్ట్స్ స్కూల్‌కు రూ.21కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు రూ.349.66కోట్లు, వరదకాలువల పనులకు 299.16కోట్లు, కాళేశ్వరం రూ.2,685కోట్లు, మానేరు ప్రాజెక్ట్‌కు రూ.లక్ష, బొగ్గులవాగు(మంథని)రూ.34లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్‌కు రూ.2.23కోట్లను కేటాయించింది.
Similar News
News March 22, 2025
ఉమ్మడి కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న ఐదుగురు మృతిచెందారు. KNR(D)శంకరపట్నంలో బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని తండ్రీ, కొడుకులు షేక్ అజీమ్, అబ్దుల్ రెహ్నాన్ చనిపోయారు. సైదాపూర్(M)బొత్తలపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో సదయ్య మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేట(M)రాచర్లబొప్పాపూర్‌లో శ్రీనివాస్ పురుగుమందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. HZB(M)తుమ్మనపల్లి ఎస్సారెస్పీ కెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.
News March 21, 2025
చొప్పదండి: భారీ వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న పంట

చొప్పదండి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కురిసిన వర్షానికి చేతికి అందే పంట పూర్తిగా ధ్వంసమైందని రైతులు వాపోయారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నియోజకవర్గంలోని రోడ్లు జలమయమయ్యాయి. వర్షం ధాటికి తీవ్రంగా నష్టపోయామని రైతులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
News March 21, 2025
శంకరపట్నం: రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కుమారుడు మృతి

శంకరపట్నం మండలం కేశవపట్నం బస్టాండ్ వద్ద << 15837379>>లారీ, బైకు ఢీకొన్న<<>> సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలం మక్తకి చెందిన ఎస్కే అజీమ్, తన కుమారుడు రెహమాన్ శంకరపట్నం నుంచి బైకుపై ఇంటికి వెళ్తుండగా.. కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో బైక్‌పై వెళ్తున్న మెట్‌పల్లికి చెందిన మందాడి శ్రీనివాస్‌రెడ్డికి గాయాలయ్యాయి.