News February 1, 2025

బడ్జెట్లో ఖమ్మంకు తీవ్ర అన్యాయం: సీపీఎం

image

ఖమ్మం: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, బిహార్ ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని ఆరోపించారు. జిల్లాకు నిధుల కేటాయింపుపై అన్యాయం చేశారని, దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 2, 2025

ఖమ్మం జిల్లాకు నేడు మంత్రి పొంగులేటి రాక

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నేలకొండపల్లి, ఖమ్మం, అశ్వారావుపేట, వైరా మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు.

News February 1, 2025

జాతీయ స్థాయి క్రికెట్‌కు ఖమ్మం బాలికలు

image

ఖమ్మం జిల్లాకు చెందిన యమున, యశస్వినిలు అండర్-17 జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కోచ్ మతీన్ తెలిపారు. హర్యానాలో 3 నుంచి 7 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. వీరిని పలువురు అభినందించారు.

News February 1, 2025

వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ ప్లాంట్‌లు

image

వ్యవసాయయోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుత్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలని ఖమ్మం SE సురేందర్‌ కోరారు. 500 కిలోవాట్ల నుంచి 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్లాంట్‌లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను TGERC నిర్ణయించిన టారిఫ్‌ ఆధారంగా విద్యుత్‌ డిస్కంలు కొనుగోలు చేస్తాయన్నారు. www.tgredco.telangana.gov.inవెబ్‌సైట్‌లో 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.