News July 23, 2024
బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: మంత్రి ఉత్తమ్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాకుండా బీజేపీ మిత్రపక్షాలు, జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు.
Similar News
News November 6, 2024
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వివరాల సేకరణకు గాను ఎన్యుమరేటర్లను, సూపర్‌వైజర్లను నియమించడమే కాకుండా, వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.
News November 5, 2024
SRPT: యువకుడి ఆత్మహత్య
కోదాడ మండలం కూచిపూడి తండాలో సాయి భగవాన్ అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విషయంలో మాట్లాడదామని పిలిచి యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి సాయి భగవాన్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 5, 2024
SRPT: మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన టీచర్ సస్పెండ్
మోతె మండలం రామాపురం ప్రాథమిక పాఠశాల <<14534111>>ఉపాధ్యాయుడు ఉపేందర్ మద్యం సేవించి<<>> పాఠశాలకు వస్తున్నాడని స్థానికులు, అధికారులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించారు. ఉపేందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను మండల విద్యాధికారి ద్వారా సంబంధిత ఉపాధ్యాయుడికి అందజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.