News September 27, 2024
బయోటెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యం: రీతూ శర్మ
కాకతీయ యూనివర్సిటీ జంతు శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ అంశంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ రీతూ శర్మ హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు.
Similar News
News November 25, 2024
నర్సంపేట: 29న పారా మెడికల్ కోర్సులకు ఇంటర్వ్యూలు
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఈ ఏడాది ప్రారంభం కానున్న పారా మెడికల్ కళాశాలలో వివిధ కోర్సుల ప్రవేశానికి ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. నర్సంపేట ప్రభుత్వ పారామెడికల్ కళాశాలలో D.ECG, D.Dialysis కోర్సులు ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
News November 25, 2024
MHBD: మొదటి జీతం అందుకోకుండానే టీచర్ మృతి
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకొని మొదటి జీతం అందుకోకుండానే రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడిని మృత్యువు కబళించింది. MHBD జిల్లా గంగారం మండలం బావురుగొండ టీచర్ ఉపేందర్ (45) పాఠశాలకు వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని మృతి చెందారు. బయ్యారం మండలానికి చెందిన ఉపేందర్ ఇటీవల ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ఉపేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News November 25, 2024
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొననున్నారు.