News February 3, 2025

బయ్యారం: చిన్నారిపై వృద్ధుడి అసభ్య ప్రవర్తన

image

చిన్నారిపై వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తన ఘటన బయ్యారం(M)లో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన వృద్ధుడు చెన్నయ్య ఇంటి సమీపంలోని చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు మందలించారు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉండటంతో మద్యం మత్తులో వికృతచేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.

Similar News

News March 13, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> కోయ్యూరులో అర్థరాత్రి మార్గమధ్యలో ప్రసవం
>జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి
>దేవీపట్నంలో పెళ్లి రోజే ఆమెకు చివరి రోజు
>అల్లూరిలో ఇంటర్ పరీక్షలకు 301మంది గైర్హాజరు
>రంపచోడవరంలో జీడిపిక్కలు కొనుగోలు చేస్తాం
>రాజవొమ్మంగిలో ఠారెత్తిస్తున్న ఎండలు..నిర్మానుష్యంగా రహదారులు
>పాడేరు జనసేన నేతపై దాడి..కేజీహెచ్‌కు తరలింపు
>అరకులో పర్యటించిన సీఆర్డీ జాయింట్ కమిషనర్

News March 13, 2025

‘శ్రీ సత్య సాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మారుద్దాం’

image

శ్రీ సత్య సాయి జిల్లాని నేర రహిత జిల్లాగా మారుద్దామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హిందూపురం సమీపంలోని అప్పలకొండ క్రాస్ వద్ద డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. హక్కులను వినియోగించుకొని జిల్లాలను నేర రహిత జిల్లాగా మారుద్దాం అన్నారు.

News March 13, 2025

పాడేరు: ‘కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’

image

నేటి యువత, విద్యార్థిని, విద్యార్థులు కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కవయిత్రి మొల్ల జయంతిని నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రచించారని కొనియాడారు.

error: Content is protected !!