News February 25, 2025

బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య

image

బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన తల్లి ఎల్లమ్మ (58), కొడుకు మొగులప్ప 36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.   

Similar News

News February 25, 2025

జనగాం: వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలి: కలెక్టర్

image

రాబోయే వేసవిలో క్షేత్ర స్థాయిలో నిరంతరం విద్యుత్ ఉండాలని, దాని కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు జనగాం సూర్యాపేట రోడ్డులో ఉన్న 33/11 సబ్ స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఫీడర్ల వారీగా, LV అంతరాయాలను సమీక్షించారు. సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.

News February 25, 2025

బంగారం కాదు వెండిని కొంటా: ఫేమస్ ఇన్వెస్టర్

image

వెండి తక్కువ ధరకు దొరుకుతోందని ఆథర్, కమోడిటీ గురువు జిమ్ రోజర్స్ అంటున్నారు. బంగారమంటే తనకెంతో ఇష్టమని, దాని విలువ అతిగా పెరిగిందని పేర్కొన్నారు. అందుకే తాను వెండిని కొంటానని చెప్పారు. ఎకానమీ మెరుగవుతోందని, మళ్లీ పరిశ్రమలకు దాని అవసరం పెరుగుతుందని అంచనా వేశారు. ఈ 2 మెటల్స్ అత్యంత విలువైనవని వివరించారు. అలాగే అగ్రి కమోడిటీస్‌పై దృష్టి పెడతానన్నారు. Note: ఈ వార్త సమాచారం కోసమే. పెట్టుబడి సూచన కాదు.

News February 25, 2025

జనగాం: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన కలెక్టర్

image

జనగాం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల జీవన ఉపాధికి, ఆర్థిక స్వేచ్ఛకు క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఇంతటి విశాలమైన, శుభ్రమైన క్యాంటీన్ ప్రారంభించినందుకు మెప్మా లతాశ్రీ, ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ను కలెక్టర్ అభినందించారు.

error: Content is protected !!