News March 11, 2025
బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రి కుర్రాడి విజయం

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రికి చెందిన అక్షయ్ విజేతగా నిలిచారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 100 మందికి పైగా పోటీలో పాల్గొన్నారు. అక్షయ్ 70 విభాగంలో తన ప్రతిభ చాటి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. పట్టణవాసులు పలువురు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 11, 2025
జనగామ: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నామా!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. జనగామలో గాలినాణ్యత విలువ 103గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవరముంది. ఏమంటారు!
News March 11, 2025
BHPL: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నామా!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. భూపాలపల్లిలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవరముంది. ఏమంటారు!
News March 11, 2025
ఆర్థికమాంద్యం ముప్పులో అమెరికా!

అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిబంధనలతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఇన్వెస్టర్లు భావించడంతో నాస్‌డాక్ 4 శాతం క్షీణించింది. 2022 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద నష్టం ఇదే. టెస్లా, Nvidia, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ షేర్లు భారీగా నష్టపోయాయి. 1.9 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఈ ఏడాది అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు 40%కి పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.