News February 12, 2025
బాదేపల్లి మార్కెట్‌లో నేటి ధరలు
జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు 3137 క్వింటాళ్లు వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠం ధర రూ.6881, కనిష్ఠ ధర రూ.4050 లభించింది. కందులు 130 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా ధర రూ.6926, కనిష్ఠం ధర రూ.5200 లభించింది. పత్తికి క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.6709 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.2411 లభించింది.
Similar News
News February 12, 2025
మన్యంకొండకు పోటెత్తిన భక్త జనం
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లానుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అర్ధరాత్రి జరిగే (తెరు) రథోత్సవాన్ని వీక్షించడానికి భక్తజనం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కాలినడకన కదలి రావడం జరిగింది. గోవిందా.. హరి.. గోవిందా అంటూ గోవిందా నామాలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
News February 12, 2025
‘సింగిల్ విండో పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించాలి’
సింగిల్ విండో పాలకవర్గాల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించాలని మహబూబ్ నగర్ పీఎసీఎస్ ఛైర్మన్లు డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఎసీఎస్ చైర్మన్లు మాట్లాడుతూ సర్పంచులు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ల పాలకవర్గం ముగియగానే అధికారుల పాలన మొదలవుతుందని, అధికారుల పాలనలో కంటే ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలను కొనసాగిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
News February 12, 2025
సామాజిక భద్రత పథకాలలో ప్రజలకు చేర్చండి: శివేంద్ర ప్రతాప్
జిల్లాలోని ప్రజలందరినీ సామాజిక భద్రతా పథకాలలో చేర్చాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ బ్యాంకులను కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 14, 15 తేదీల్లో శిల్పారామంలో జరిగే మన మహబూబ్‌నగర్ మహా నగరోత్సవం మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.