News June 12, 2024
బాన్సువాడలో వృద్ధురాలిని హత్య చేసిన దుండగులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718189110476-normal-WIFI.webp)
వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. మండలంలోని తాడ్కోల్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో బుధవారం ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఉప్పెర సాయవ్వను గొంతుకోసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె మెడలోని బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 11, 2025
నవీపేట్: చదువు అర్థం కావడం లేదని విద్యార్థి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739203012671_51952651-normal-WIFI.webp)
నవీపేట్ మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన అభిషేక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అవ్వడంతో తల్లదండ్రులు మళ్లీ ఒప్పించి కాలేజీలో జాయిన్ చేశారు. తన తోటి ఫ్రెండ్స్‌తో చదువు అర్థం కావడం లేదని మనస్థాపం చెంది గత నెల 27వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలిచగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.
News February 11, 2025
NZB: జిల్లా ఓటర్ల వివరాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195671041_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లో 48 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 31,574 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 19,993 మంది పురుషులు, 11,581 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు వివరించారు.
News February 11, 2025
NZB: జిల్లా ఓటర్లు ఎంతమందంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739196171676_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఓటర్ల వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లోని 33 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 3,751 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ డివిజన్లో 2001, ఆర్మూర్ డివిజన్లో 1049, బోధన్ డివిజన్లో 701 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.