News March 24, 2025
బాపట్ల: ’25 రోజులు పొడిగించాలి’

బీసీ కార్పొరేషన్ లోన్‌ల విధానాలలో కొన్ని సవరణలు చేయాలని బాపట్ల జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు కోరారు. ఈ మేరకు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెంకట్ మురళిని కలిసి వినతి పత్రం అందజేశారు. బీసీ కార్పొరేషన్ లోన్‌లకు గడువు కనీసం 25 రోజులు పొడిగించాలన్నారు. సచివాలయ సిబ్బందితో బీసీ కార్పొరేషన్ లోన్లు గురించి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
Similar News
News December 22, 2025
ISRO ప్రొపల్షన్ కాంప్లెక్స్ 100పోస్టులకు నోటిఫికేషన్

<
News December 22, 2025
మొటిమల మచ్చలు తగ్గట్లేదా?

వాతావరణం, హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది అమ్మాయిలు మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలు, వాటి వల్ల వచ్చిన నల్లటి మచ్చలు తగ్గించడానికి చింతపండు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. చింతపండు గుజ్జులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత ముఖాన్ని కడిగితే చాలు. అలాగే చింతపండు గుజ్జులో అరటిపండు, శెనగపిండి కలిపి ముఖానికి రాస్తే చర్మం క్లీన్ అవుతుంది.
News December 22, 2025
అక్షర బాటలో బాలయపల్లె ప్రాథమిక పాఠశాల ఆయమ్మ

కాశినాయన మండలం బాలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయాగా యంబడి బాల నాగమ్మ చాలా కాలంగా పనిచేస్తోంది. చదువంటే ఆమెకు మక్కువ కానీ పరిస్థితులు అనుకూలించక నిరక్షరాస్యురాలిగానే ఉంది. పాఠశాలలో విద్యార్థులను గమనించిన ఆమె తనకు కూడా అక్షరాలు నేర్చుకోవాలని ఉందని ఉపాధ్యాయుడు ఖాసీం వల్లికి తెలిపింది. స్పందించిన ఉపాధ్యాయుడు ఆయమ్మకి ‘రోజుకో అక్షరం’ నేర్పుతున్నారు. ఆయమ్మ సంతోషం వ్యక్తం చేసింది.


