News March 15, 2025
బాపట్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్పెషలాఫీసర్

బాపట్ల పట్టణంలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను బాపట్ల జిల్లా స్పెషల్ అధికారి కృతిక శుక్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పరిశీలించారు. శనివారం ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, తదితర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

ఆసుపత్రుల్లో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సుధీర్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వేసవి నేపథ్యంలో ఫ్యాన్లు, తాగునీరు, మొదలగు సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
News March 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 16, ఆదివారం ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు ఇష: రాత్రి 7.38 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 16, 2025
MNCL: అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు సాయి శ్రీవల్లి

మంచిర్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి శ్రీవల్లి అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు ఎంపికైంది. జూన్ 15 నుంచి 21వరకు జపాన్‌లో జరిగే సకురా అంతర్జాతీయ సైన్స్ సదస్సులో ఆమె పాల్గొననుంది. స్త్రీల నెలవారి రుతుక్రమం ప్రక్రియలో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి శ్రీజ సొంతంగా రుతుమిత్ర కిట్ పరికరం రూపొందించింది. ఈ సందర్భంగా డీఈఓ యాదయ్య, సైన్స్ అధికారి మధుబాబు ఆమెను అభినందించారు.