News March 20, 2025
బాపట్ల కలెక్టర్ కీలక ఆదేశాలు

బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో జిల్లా ప్రగతి నివేదికలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాను వ్యవసాయ అనుబంధ రంగాలలో, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చెందే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలో మత్స్య, ఆక్వా సంపదకు అన్ని వనరులున్నాయన్నారు.
Similar News
News March 28, 2025
నిజామాబాద్ జిల్లాలో గంజాయి కలకలం

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామంలో గంజాయి కలకలం రేపింది. అపురూపాలయం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తుండగా స్థానిక విలేకర్లు గ్రామస్థుల సహాయంతో పట్టుకున్నారు. గ్రామంలో విచారించగా వీరు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిసింది. మాక్లూర్ పోలీస్‌లకు సమాచారం అందించగా నిందితుల నుంచి మూడు ప్యాకెట్ల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.
News March 28, 2025
నెల్లూరు: ఐదుగురు ఎంపీటీసీలు సస్పెండ్

విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.
News March 28, 2025
జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు నాలుగు రోజుల సెలవు

ఈనెల 29 నుంచి ఏప్రిల్ 1వరకు నాలుగు రోజులపాటు జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ప్రకటన ఒక ద్వారా తెలిపారు. రైతులు ఈ 4 రోజులు మార్కెట్‌కు తమ ఉత్పత్తులను తీసుకురావద్దని, తిరిగి 2న మార్కెట్ పునః ప్రారంభమవుతుందన్నారు.